Police Commissioner | పోలీసులకు అభినందనలు

Police Commissioner | పోలీసులకు అభినందనలు

Police Commissioner | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సెలవులు ముగిసిన నేపథ్యంలో విజయవాడ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసుల పనితీరును ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి.రాజశేఖర్ బాబు అభినందించారు.

పండుగ అనంతరం రహదారులపై వాహనాల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, ముందస్తు ప్రణాళికలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో నగరంలో ఎక్కడా తీవ్రమైన ట్రాఫిక్ కం జక్షన్ ఏర్పడకుండా అధికారులు సమర్థంగా నియంత్రించారని కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందన్నసమాచారం అందగానే, ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం ఇతర అధికారులతో కలిసి స్వయంగా పర్యవేక్షిస్తూ అతి తక్కువ సమయంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం ప్రశంసనీయమని తెలిపారు.

ట్రాఫిక్ డీసీపీ, ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీలు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల వాహన రాకపోకలు నిరాఘాటంగా కొనసాగాయని కమిషనర్ అన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Leave a Reply