MP | డీకే అరుణకు ఆహ్వానం..

MP | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామంలో జరిగే శ్రీ బండ తిమ్మప్ప జాతర ఉత్సవాలకు హాజరు కావాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను ఆలయ కమిటీ నిర్వాహకులు, నాయకులు ఆదివారం ఆహ్వానించారు. పెద్ద జట్రం గ్రామంలో శ్రీ బండ తిమ్మప్ప దేవాలయంలో 507వ శ్రీ శివరామనామ జపయజ్ఞం, గీతాజ్ఞాన యజ్ఞం పారాయణం నిర్వహిస్తున్నట్లు ఎంపీకి వివరించారు.
జాతర వేడుకలు ఫిబ్రవరి 04,05, 06 వరుసగా మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ధ్వజ స్థంభం, నవగ్రహాలు, శిఖరకలశం జంట నాగుల ప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఎంపీ డీకే అరుణమ్మకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్, మాజీ ఎంపీటీస కిరణ్ కుమార్, తిప్పరెడ్డి, సప్పటి శ్రీను, కురువ జల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
