Chief Justice | చెరువుగట్టులో సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు

Chief Justice | చెరువుగట్టులో సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు
Chief Justice | నార్కట్ పల్లి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు చెరువుగట్టులో పూజలు నిర్వహించారు. శనివారం నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి మండలం, చెరువుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు విచ్చేయగా, వారికి సాంప్రదాయ బద్ధంగా అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో సల్వాది మోహన్ బాబు శాలువాతో సన్మానించి, స్వామివారి పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ ఎల్ వెంకటేశ్వరరావు, జిల్లా జడ్జి ప్రసాద్, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సిద్ధార్థ శర్మ, ఆర్ ఐ తరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు.
