MLA | అభివృద్ధి ధ్యేయంగా..

MLA | అభివృద్ధి ధ్యేయంగా..

  • ముందుకు సాగుతున్న ప్రజా పాలన ప్రభుత్వం
  • 22న నాగోబా దర్బార్‌కు ఉపముఖ్యమంత్రి, మంత్రుల రాక
  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్

MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు సాగుతుంద‌ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ పర్యటనను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈనెల 22న కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే ప్రజా దర్బార్‌కు ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండ సురేఖ, వివేక్ వెంకటస్వామి వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కేస్లాపూర్ ద‌ర్బార్ వచ్చే వీఐపీలకు ధనోర నుంచి దుప్పగూడ వయా కేస్లాపూర్ నాగోబా సందర్శనకు ప్రత్యేకంగా రావడానికి రూటు ఏర్పాటు చేసినట్లు, మిగతా ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు ముత్నూర్ మీదుగా రావడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి 22 కోట్ల రూపాయల నిధుల మంజూరు కోసం సీఎం హామీ ఇచ్చారని, చిలక ప్రాజెక్టుకు స్వర్గీయ రామచంద్ర రెడ్డి పేరు, స్వర్ణ ప్రాజెక్టుకు న‌ర్సారెడ్డి పేరు, సదర్ మాట్ ప్రాజెక్టుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరును పెట్టడం జరుగుతుందని తెలిపారు. సీఎం ప్రారంభించిన సదర్ మార్ట్ బ్యారేజ్ ద్వారా 18000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అందులో తన ఖానాపూర్ నియోజకవర్గానికి 13వేల‌ ఎకరాలు మరో ఐదువేల ఎకరాలు కోరుట్ల నియోజకవర్గం సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

కెస్లాపూర్ నాగోబా దర్బార్ సందర్భంగా కొందరు ఆదివాసి నాయకులు రగల్ జెండా వద్ద సమావేశం ఏర్పాటు చేసి పాదయాత్ర చేపడతామని నిర్ణయించారని తెలిసిందని, పుణ్య దేవస్థానం వద్ద ఎలాంటి అవాంతరాలు రాకుండా సహకరించాలని, ఏ సమస్య ఉన్నా తనకు తెలిపితే సీఎం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్యే అన్నారు.

నిన్న జరిగిన సీఎం సభలో జిల్లాకు వరాల జల్లు కురిపించారని, బ్యారేజీల ప్రారంభంతోపాటు అభివృద్ధి పనులను ప్రారంభించి మహిళా సంఘాలకు రూ.550 కోట్ల రుణాల నిధుల పత్రాలను అందజేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు నిర్మల్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, జై నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జై వంతరావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్బాల్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply