Utkoor | బాల్య మిత్రుడి కుటుంబానికి అపన్న హస్తం

Utkoor | బాల్య మిత్రుడి కుటుంబానికి అపన్న హస్తం
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాల్యమిత్రుడు గుండెపోటుతో మృతి చెందడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 1994 పూర్వ విద్యార్థులు తమ మిత్రుడి కుటుంబానికి శుక్రవారం ఆర్థిక సహాయం చేశారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ విధికి చెందిన మాల వెంకటప్ప ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. దీంతో పూర్వ విద్యార్థులంతా కలిసి మేమున్నామంటూ తమ స్నేహితుడి కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ.30 వేలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. తమతో పాటు చదివిన తమ స్నేహితుడు మృతి చెందడంతో మృతిని కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం చేయడం పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
