Arrangements | సమ్మక్క–సారాలమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పర్యవేక్షణ

Arrangements | సమ్మక్క–సారాలమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పర్యవేక్షణ
Arrangements | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : సమ్మక్క–సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. శుక్రవారం గోదావరిఖనిలో జాతర ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అర్జీ–1 జీయం లలిత్ కుమార్తో కలిసి ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. జాతరకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, విద్యుత్, రహదారి సదుపాయాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గాలిపటాలు ఎగురవేసి పండుగ సందడిలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
