Thiefs | గంగానమ్మ, కోదండ రామాలయాల్లో చోరీ

Thiefs | గంగానమ్మ, కోదండ రామాలయాల్లో చోరీ
Thiefs | చల్లపల్లి, ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం రామనగరంలోని గంగానమ్మ శ్రీ కోదండ రామాలయంలో చోరీ జరిగింది. గంగానమ్మ, కోదండ రామాలయంలో గల రెండు హుండీలను గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. హుండీలో డబ్బులను తీసుకుని ఖాళీ హుండీలను దేవాలయానికి అతి సమీపంలో దొంగలు పడవేశారు. సుమారు రెండు హుండీలలో లక్ష రూపాయలు ఉండవచ్చునని భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు.
