ప్రజల కష్టాల్లో నేనుంటా

బీస్పీ కౌన్సిలర్ అభ్యర్థి తోగిటి నవీన్

భీమ్‌గల్‌ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ ) ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిజాయితీగా ప్రజా సేవ చేస్తానని బీస్పీ కౌన్సిలర్ అభ్యర్థి తోగిటి నవీన్ అన్నారు. గురువారం భీంగల్ పట్టణంలోని 9 వ వార్డు లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా డోర్ టూ డోర్ కన్వెసింగ్ చేశారు. యువత రాజకీయాల్లోకి అడుగు పెడితే రాజకీయాల్లో అవినీతి రూపు మాపుతుందని పేర్కొన్నారు. అవినీతి కి ఆస్కారం లేకుండా సేవ చేసేందుకు తాను బీఎస్పీ పార్టీ మద్దతుతో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తన గుర్తు ఏనుగు సింబల్ కు ఓటు వేయాలని అభ్యర్తించారు. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించలేని నాయకులు కావాలో ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలో గమనించాలని కోరారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నా తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఓటర్ల కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకడిగా ఉన్న తనను గెలిపించాలని అన్నారు. వార్డు లో మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్స్, వీధి దీపాల ఏర్పాటు, మొక్కల పెంపకం, ఇంటింటికి తాగునీటి సౌకర్యం తన బాధ్యత గా చేయిస్తానని మాట ఇచ్చారు. ప్రజలు ఒక్కసారి యువత కు అవకాశం ఇవ్వాలని, మార్పు ఎలా ఉంటుందో యువత ద్వారా తెలుస్తుందని అన్నారు. తన గుర్తుకు ఏనుగు సింబల్ కు ఓటు వేయాలని వేడుకున్నారు.

Leave a Reply