స్థానికుడిగా నన్ను ఆదరించండి.. మీ అన్నగా సేవ చేస్తా..

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; నేను స్థానికుడిని, నిత్యం 9 వ వార్డ్ ప్రజలకు అందుబాటులో ఉండేవాణ్ణి, నన్ను మీ స్వంత అన్నగా ఆదరించి గెలిపిస్తే, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని ఆ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి మారిశెట్టి సుమన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.శనివారం 9 వ వార్డ్ లోని పలు ప్రధాన కాలనీల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. గత 15 ఏండ్లుగా యూత్ అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీతోపాటు పలు స్వచ్ఛంద సహాయ కార్యక్రమాలతో స్థానికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నానని వివరించారు.

కార్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు వెళ్లి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే క్రమంలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడుతానని హామీ ఇచ్చారు. గతంలో పలువురు పేదవారికి నిత్యావసర సరుకులు, ఇతర ఆర్ధిక సహకారం కూడా అందించానని, వార్డులోని సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని తనను ఆదరించాలని ఓటర్లను కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతలుగా మారి, వాహనాలకు, పాదచారులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు స్థానిక యువత సహకారంతో ఆ రోడ్డును బాగు చేసినట్లు గుర్తు చేశారు.

స్థానికుడిగా ప్రతి ఇంటితో తనకు అనుబంధం ఉందని స్థానికేతరులకు అవకాశం ఇచ్చి వార్డ్ అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రజలను చైతన్య పరుస్తూ ప్రచారాన్ని హోరేత్తించారు. ముఖ్యంగా యువత బాగా ఆలోచించి, ఇంట్లోని పెద్దవారికి కూడా సేవ చేసే అభ్యర్థి గురించి అవగాహన కల్పించి ఓటు వేసేలా చూడాలని కోరారు. ఎన్నికల సమయంలో కనిపించే నాయకుల కంటే నిత్యం ఇదే వార్డ్ లోనే నివాసం ఉండే అన్నగా, తమ్మునిగా తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.

9 వార్డ్ తరపున మున్సిపాలిటీలో బలమైన నాయకుడు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని, మీకు సేవకునిగా పని చేస్తానని తెలిపారు.బీఆర్ఎస్ హయాంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఓటర్లకు వివరించారు.ఈ ప్రచారంలో మాజీ కౌన్సిలర్ ఓరగంటి శ్రీకాంత్, యూత్ నాయకులు వంశీ, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply