9th Ward | అభివృద్ధే లక్ష్యం..మీ ఆశీస్సులే బలం

9th Ward | అభివృద్ధే లక్ష్యం..మీ ఆశీస్సులే బలం

  • గెలిపించే బాధ్యత మీది..అభివృద్ధి చేసే బాధ్యత నాది.
  • మీ ఇంటి బిడ్డగా భావించి ఆశీర్వదించండి.
  • సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాను.
  • ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటాను.
  • అర్హులందరికీ స్కీమ్ లు అందేలా చూస్తాను..
  • కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో మాదిరెడ్డి రాఘవరెడ్డి పోటీ

9th Ward | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గతంలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా, వార్డు ప్రజలందరి మనసుల్లో సుపరిచితుడిగా మాదిరెడ్డి రాఘవరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. మాటలకే పరిమితం కాకుండా, పనులు చేసి చూపించే వ్యక్తిగా ఆయన ప్రజల్లో మంచి పేరు సంపాదిం చుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాదిరెడ్డి రాఘవరెడ్డి కౌన్సిలర్ ఎన్నికల బరిలో నిలిచారు. సోమవారం ఉదయం ఆయన వార్డులో ఇంటింటా పర్య టిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఓటర్ల మద్దతు కోరారు. ఈ సంద ర్భంగా వార్డు వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గెలుపొందిన వెంటనే వార్డులోని ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.

-ఎమ్మెల్యే కడియం ఆశీస్సులతో :

ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య ఆశీస్సులు, సహకారంతో తొలి దశలోనే 25 ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానని రాఘవ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. వార్డు కోసం, ప్రజల కోసం పనిచేస్తాను. మీరు నాకు కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

ఉత్తమ వార్డు నిర్మాణం కోసం నిజాయితీగా కృషి చేస్తాను. వీధి దీపాల నిర్వహణను నిత్యం పర్యవే క్షిస్తాను. గ్రామం లోని ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పా టు చేయడానికి కృషి చేస్తాను. వృద్ధులు, దివ్యాంగులకు మొదటి ప్రాధా న్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తా ను. ముఖ్యం గా ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శక పాలన అంది స్తాను. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించి 9వ వార్డును అన్ని రంగా ల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఈ సందర్భంగా మాదిరెడ్డి రాఘ వరెడ్డి అన్నారు.

Leave a Reply