నిర్ధిష్ట గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

నిర్ధిష్ట గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

  • అభివృద్ధి పనులపై కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య సమీక్ష
  • యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ
  • 53,57 డివిజన్‌లలో పనులు తనిఖీలు చేసిన కమిషనర్‌
  • ఉప ముఖ్యమంత్రి భట్టి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిలను కలిసిన కమిషనర్‌

ఖమ్మం, ఆంధ్రప్రభ : నిర్ధిష్ట గడువులోపు అభివృద్ధి పనులు ఖచ్చితంగా పూర్తి చేయాలని ప్రజల మన్ననలు పొందే విధంగా ఖమ్మం కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరించాలని ఖమ్మం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన 53, 57 డివిజన్‌లలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య మాట్లాడుతూ.. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ప్రజలకు మరిన్ని సేవలు నిర్ణీత గడువులోగా చేయాలనే ప్రధాన ఉద్ధేశంతో కార్యక్రమం ప్రారంభించారని దీనిని ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా తీసుకొని కార్పొరేషన్‌ పరిధిలోని సిబ్బంది ప్రజలకు విస్తృత సేవలు అందించాలని అన్నారు. నగరంలోని ప్రధాన సమస్యలు ఏళ్ళ తరబడి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, ఇతర ప్రజా సమస్యలను యుద్ధ ప్రతిపాదికన తీసుకొని చర్యలు చేపట్టాలని వారి సమస్యను తీర్చాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేయాలని ఆయన ఆదేశించారు.

అభివృద్ధి పనులపై కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య సమీక్ష :

99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడవద్దని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పారిశుధ్యం, డ్రైనేజ్‌, ఇతర మౌళిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల తీరుపై ఆయన డివిజన్‌లలో పర్యటించి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులు అభివృద్ధి పనులను బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలోనే ఖమ్మం కార్పొరేషన్‌కు మంచి పేరు తేవాలని అన్నారు. సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యమని అందరు కలిసికట్టుగా పని చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశాలతో కార్పొరేషన్‌లోని ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ :

నగరంలో ప్రస్తుతం జరుగుతున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని యుద్ధప్రతిపాదికన తీసుకొని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి జరుగుతున్న పనుల తీరుపై తనకు నివేదిక అందించాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ అంశంపై అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

53,57 డివిజన్‌లలో పనులు తనిఖీలు చేసిన కమిషనర్‌ :

నగరంలోని 53, 57వ డివిజన్‌లలో జరుగుతున్న పనుల పురోగతిని కమిషనర్‌ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో లోటుపాట్లు జరిగితే సహించే ప్రసక్తే లేదన్నారు.

ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రులను కలిసిన కమిషనర్‌ :

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న ప్రధాన అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రాజెక్టులు, నిధుల విడుదల తదితర అంశాలపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని, ప్రజలు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply