9 year old | బాలిక మృతి

9 year old | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అనుమానాస్పద స్థితిలో 9 ఏళ్ల బాలిక మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో చోటుచేసుకుంది. స్థానిక మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని మూడో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలలో వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో బాలికను ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానిక పీహెచ్ సీలో చూపించి బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలిక మృతిచెందినట్లు తెలిపారు.

Leave a Reply