మీ ఇంటి బిడ్డను నన్ను ఆశీర్వదించండి..

8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా చాతరబోయిన సత్యనారాయణ

మీ ఇంటి బిడ్డను నన్ను ఆశీర్వదించండి..
-ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటాను.
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆశీస్సులతో..
-కురుమ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తా.
-మంగలి, కుమ్మరి వృత్తిదారులకు మోడల్ కాలనీగా చేయిస్తా
-అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
-ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పక్కా 50 ఇండ్లు ఇప్పిస్తాను
-పార్క్, బస్సు షెల్టర్, టాయిలెట్ల నిర్మాణం చేయిస్తాను
-ఉర చెరువు మత్తడి వద్ద కల్వర్ట్ నిర్మాణం చేయిస్తా
-యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
-గెలిపించే బాధ్యత మీది..అభివృద్ధి చేసే బాధ్యత నాది.

ఆంధ్రప్రభ స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్‌ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా చాతరబోయిన సత్యనారాయణ పోటీ చేస్తు న్నారు. ఇందుకు సంబంధించిన బీ ఫామ్‌ను స్టేషన్‌ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడి యం శ్రీహరి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ..గెలిచిన వెంటనే వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలిపారు.

ఎమ్మెల్యే ఆశీస్సులతో గతం లో ఎన్నడూ లేని విధంగా కురుమ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మా ణం, గుడిబండ బజార్ నుంచి మంచినీళ్ల బావి వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మంగలి, కుమ్మరి వృత్తి దారుల పాత ఇండ్ల స్థానంలో మోడల్ కాలనీ నిర్మాణం, గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

-ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను:

ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 50 ఇండ్లు ఇప్పించే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. హైవే నుంచి మంచినీళ్ల బావి వరకు సీసీ రోడ్డు వేసి, రోడ్డు విస్తరణ పనులు చేపడతానని పేర్కొ న్నారు. వార్డులోని డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమిలో పార్క్ నిర్మాణం, బస్టాండ్ ఏరియాలో బస్సు షెల్టర్‌తో పాటు ప్రజలకు అవస రమైన టాయిలెట్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఊర చెరువు మత్తడి వద్ద రాకపోకలకు సౌకర్యంగా కల్వర్ట్ నిర్మాణం, యువతకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించి ఉపాధి అవకాశాల కల్పనకు కృషి, ప్రజల కోరిక మేరకు దాబా బంగ్లా ప్రాంత అభివృద్ధి చేస్తామని వెల్లడిం చారు.

తనకు పార్టీ టికెట్ కోసం సహకరించిన పోగుల సారంగపాణి, కందుకూరు హిమబిందు, కుందూరు వెంకట్ రెడ్డి, భాస్కుల ఎల్లయ్య, గాండ్ల మల్లికార్జున్, శాగ రాములు, చేపూరి మహేందర్, కుంట రమేష్, పిట్టల చంద్రమౌళి, రంగు ప్రభాకర్, గాండ్ల రవి, చెన్న నర్సింహులు, రేకు లపల్లి వెంకట్ రెడ్డి, బూర్ల యాకయ్య, ముప్పిడి శ్రీను, ముప్పిడి వెంక టేష్ తదితర ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ టికెట్ అందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అభివృద్ధి, సంక్షేమ మే ఎజెండాగా పారదర్శక పాలన అందించడమే తన లక్ష్యమని సత్య నారాయణ పేర్కొన్నారు.

Leave a Reply