ఆశీర్వదిస్తే …వార్డు అభివృద్ధి చేస్తా

ఆశీర్వదిస్తే …వార్డు అభివృద్ధి చేస్తా

  • కూరపాటి జయమ్మ రాములు
  • 8 వవార్డు బి ఆర్ ఎస్ బలపర్చిన సిపిఎం అభ్యర్థి

మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాల్టీ ప్రజలు ఆశీర్వదించి 8 వవార్డులో తనను గెలిపిస్తే అన్ని విధాలా వార్డును అభివృద్ధి చేస్తానని బి ఆర్ ఎస్ బలపర్చిన సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థిని కూరపాటి జయమ్మ రాములు అన్నారు. గురువారం ఆ వార్డులో మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

8 వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశలలో పాలకులను నిలదీసి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామన్నారు.11 వార్డులల్లో సిపిఎం బలపరచిన బి ఆర్ ఎస్ అభ్యర్థులను, 8 వ వార్డులో బి ఆర్ ఎస్ బలపరచిన సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,రాచకొండ రాములమ్మ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, ఆత్మకూర్ మండల కార్యదర్శి వేముల బిక్షం, సీనియర్ నాయకులు వనం శాంతి కూమార్,కూరపాటి రాములు, గుండు లక్ష్మి, కందుకూరి నర్సింహా, పోచం లక్ష్మణ్, కూరపాటి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply