నేటి వరకు 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు..

- రైతుల ఖాతాల్లో రూ. 1,713 కోట్లు జమ..
- ధాన్యం కొనుగోలు చేసిన 4-6 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ..
- రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : రైతులు దళారులను నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ రూరల్ లోని కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతులు రూపాయి నష్టం పోకుండా ధాన్యం కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వారి ఖాతాల్లో 4-6 గంటల్లో నగదు జమ వేస్తున్నామన్నారు. కొద్దిమంది నేతలు అన్యాయంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రైతులు అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
గత ప్రభుత్వం రైతులకు రూ. 1,674 కోట్ల బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. కృష్ణా జిల్లాలో లక్షా 7 వేల టన్నుల ధాన్యం సేకరించడం నేడు ఒక రికార్డు అని అన్నారు. గోదావరి జిల్లాల నుంచి లక్ష టన్నుల పైనే ధాన్యం సేకరించామని, ఫీల్డ్ లో అధికారులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని వారి మనోధైర్యం దెబ్బ తీసేలా కొద్దిమంది నేతలు నొటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం 2022-23 లో 3,33,155 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 679.79 కోట్లు వారి ఖాతాల్లో వేస్తే కూటమి ప్రభుత్వం నేటి వరకు 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ. 1,713 కోట్లు జమ చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఇదే రోజున ట్రాన్స్ పోర్టు శాఖ లో 394 లారీలను నమోదు చేసుకున్నారన్నారు.
2023-24 లో 455 లారీలు మాత్రమే నమోదు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో నేడు 2,715 లారీలను ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ శాఖ లో నమోదు చేసుకున్నారన్నారు . ఖరీఫ్, రబీ లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ట్రాన్స్ పోర్టు వాహనాల బకాయిలను నేడు రూ. 9 కోట్లు చెల్లించామన్నారు.
7 కోట్ల 53 లక్షల గోనె సంచులను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో వీటికి అదనంగా లక్ష గోనె సంచులను రైతు సేవా కేంద్రాల్లో అదనంగా సిద్దం చేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ వాతవరణంలో వచ్చిన మార్పులతో రైతుల ఆందోళనను గుర్తించి ముందే ధాన్యం సేకరిస్తున్నామన్నారు.
ప్రభుత్వం చాలా వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటున్న విషయం రైతులు కూడా అర్దం చేసుకోవాలన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఇచ్చే సూచనలు, ప్రోత్సాహం వల్లే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
దళారులు రైతులను మాయ మాటలతో మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 75 కిలోల బస్తాకు రూ. 1792 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో 30 వ తేదీ వరకు మనకు వర్షాలు లేవన్నారు.
ఆ తర్వాత ఐదు జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయి కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దళారులు చేసే మోసాలు నమ్మవద్దన్నారు.
24 వేల ట్రక్స్ ధాన్యం తరలింపుకు జీపీయస్ తో సిద్దంగా ఉన్నాయన్నారు. వర్షాల నుంచి కౌలు రైతులను ఆదుకునేందుకు టార్పాలిన్ పట్టాలు పూర్తిగా సిద్దంగా ఉంచామన్నారు.
దళారీల అబద్దాలు నమ్మి రైతులు తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సివిల్ సప్లయిస్ శాఖ రైతుల కోసం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. క్యాబినెట్ సమావేశం తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మరోసారి పర్యటించి రైతులకు భరోసా కల్పిస్తామన్నారు.
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ క్రాప్ నమోదు అయిన పొలంలో వచ్చే దిగుబడిని పూర్తిగా కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పైన్ క్వాలిటీ రైస్ కు ప్రాధాన్యత ఇచ్చి.. మధ్యాహ్న భోజన పథకానికి వాడుతున్నామని, ఆ పంట ఎక్కడ ఉన్నా.. ప్రతి బస్తా కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పామన్నారు. రాజకీయంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి రైతులే సమాధానం చెప్పాలన్నారు.
