7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవిద్య నీలాగౌడ్ గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 7వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన శ్రీవిద్య నీలాగౌడ్ విజయం సాధించారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి 633 ఓట్లు రాగా బిఆర్ఎస్ నవీద్ పాషా 489 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవిద్య నీలాగౌడ్ 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Leave a Reply