ఓటు మీ వంతు… అభివృద్ధి నా బాధ్యత

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ ఆదివారం ప్రచారం లో దూకుడు పెంచారు. వార్డ్ అభివృద్ధి.. నా ధ్యేయం అంటూ 7 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి శైలజ గడపగడపను తట్టి మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. కౌన్సిలర్ గా తనను ఎన్నుకుంటే అభివృద్ధి చేసి చూపుతామన్నారు . సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళతానని హామీ ఇస్తున్నారు. వార్డులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మాణం చేపట్టేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.ఫిబ్రవరి 11 న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె వెంట మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply