పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జోరుగా ప్రచారం..

పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జోరుగా ప్రచారం..

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ ఆధ్వర్యంలో

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏడవ వార్డు పరిధిలోని శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస కాలనీ టు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వీధి తదితర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కరపత్రాలు పంచుతూ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఏడో వార్డు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు అందే విధంగా కృషి చేస్తానని అభ్యర్థి సునీల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply