77 th  Nara Darbar :  జనం వేడుకోలు

77 th  Nara Darbar :  జనం వేడుకోలు

సార్​ విమల  స్కూలు తెరవండి

పెండింగ్​ జీతాలు ఇప్పించండి

ప్లీజ్​ రౌడీ షీట్​ తొలగించాలి సార్​

మంత్రి లోకేష్​కు జనం విన్నపాలు  వినతులు స్వీకరించిన మంత్రి

( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో )

పలు ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు విశాఖ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం (12 డిసెంబర్​ 2025)  ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 77వ రోజు ప్రజాదర్బార్ ( 77 th  Nara Darbar) నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై ప్రజల  నుంచి అర్జీలు స్వీకరించారు.

77 th  Nara Darbar

77 th  Nara Darbar

 స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని(స్టీల్ ప్లాంట్) ఏకపక్షంగా మూసివేయడంతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విశాఖ విమల విద్యాలయం స్కూల్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్పేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

77 th  Nara Darbar

77 th  Nara Darbar

రెగ్యులర్ స్టాఫ్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్ ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేసి, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

తన తండ్రికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని దివకాల గంగరాజు ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన ఈర్ల అప్పలరాజు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు.

77 th  Nara Darbar

77 th  Nara Darbar

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు(కన్నబాబు) ప్రోద్బలంతో తనపై నమోదు చేసిన రౌడీషీట్ ను రద్దు చేయాలని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల వివేక్ కోరారు. ఆయా వినతులను పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply