66.20 kmrs | రైల్వే అభివృద్ధితో సరికొత్త అధ్యాయం..

66.20 kmrs | రైల్వే అభివృద్ధితో సరికొత్త అధ్యాయం..

పూర్తి స్థాయిలో కనెక్టివిటీ విస్తరణ
పరిశ్రమల వృద్ధికి రైల్వేలే బలమైన ఆధారం..
రైల్వే నిపుణుల అభిప్రాయం…

66.20 kmrs | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రవాణా మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాంతాల మధ్య అనుసంధానం, పరిశ్రమల విస్తరణకు రైల్వే ఆధారిత అభివృద్ధి కీలకమని నిపుణులు పేర్కొన్నారు. కాన్ఫడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ విజయవాడ వార్షిక సమావేశంలో ప్రత్యేక చర్చా కార్యక్రమం విజయవాడ రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. రైల్వేలు, నౌకాశ్రయాలు, పరిశ్రమల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని సమావేశంలో పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

సమావేశంలో ప్రసంగించిన రైల్వే బోర్డు అదనపు సభ్యుడు దేవేంద్ర కుమార్ దేశవ్యాప్తంగా రవాణా రంగంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే విభాగంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో వేగవంతమైన సేవలను అందించేందుకు వందే భారత్ ఎక్ష్ప్రెస్స్, అమృత్ భారత్ ఎక్ష్ప్రెస్స్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టినట్లు వివరించారు.

66.20 kmrs | నూతన సాంకేతికతలను ప్రోత్సహిస్తూ

66.20 kmrs |
66.20 kmrs |

ఇవి ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయని తెలిపారు. దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నూతన సాంకేతికతలను ప్రోత్సహిస్తూ స్టార్టప్ సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంచుతూ రైల్వే సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రవాణా వ్యయాల పరంగా రైల్వేలు అత్యంత చౌకైన మార్గమని దేవేంద్ర కుమార్ తెలిపారు. టన్నుకు కిలోమీటరుకు రైల్వే రవాణా ఖర్చు సగటున రూ.1.96 మాత్రమే ఉండగా, రోడ్డు మార్గంలో అది రూ.3.78 వరకు ఉంటుందని చెప్పారు. విమాన రవాణాలో ఈ ఖర్చు రూ.72 వరకు ఉంటుందని వివరించారు.

66.20 kmrs | రైల్వేల వాటాను మరింత పెంచే దిశగా చర్యలు

దేశ అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా సరుకు రవాణాలో రైల్వేల వాటాను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ రైల్వే విభాగ డివిజనల్ రైల్వే మేనేజర్ మొహిత్ సోనాకియా మాట్లాడుతూ ఈ విభాగం సరుకు రవాణా, ప్రాంతీయ అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దువ్వాడ వంటి ప్రాంతాల నుంచి సిమెంట్ వంటి భారీ సరుకుల రవాణాకు ఈ విభాగం ముఖ్య కేంద్రంగా ఉందని చెప్పారు.

కృష్ణపట్నం పోర్ట్,కాకినాడ పోర్ట్ వంటి ప్రధాన నౌకాశ్రయాలకు రైల్వే అనుసంధానం ఉండటం వల్ల ఎగుమతి పరిశ్రమలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మచిలీపట్నం రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా భారీ వర్షాలు, తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రైల్వే వంతెనలు, ఇతర మౌలిక వసతులను బలోపేతం చేసే పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

సీఐఐ విజయవాడ చైర్‌పర్సన్ డాక్టర్ వి. నాగలక్ష్మి మాట్లాడుతూ రైల్వేలు, నౌకాశ్రయాలు, పరిశ్రమల సమన్వయంతో కూడిన వ్యవస్థ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రధాన ఎగుమతి ద్వారంగా ఎదగగలదన్నారు. విశాఖపట్నం పోర్ట్ , గంగవరం పోర్ట్ , కృష్ణపట్నం, కాకినాడ వంటి ప్రధాన నౌకాశ్రయాలు రాష్ట్రానికి సహజమైన వ్యాపార ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. రామకృష్ణ రెడ్డి రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.

విశాఖపట్నం మెట్రో రైల్వే ప్రాజెక్ట్ కింద నాలుగు మార్గాల్లో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలు ప్రతిపాదించబడ్డాయని చెప్పారు. విజయవాడ మెట్రో రైల్వే ప్రాజెక్ట్ కింద మూడు మార్గాల్లో మొత్తం 66.20 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి. రామకృష్ణ మాట్లాడుతూ భారీ సరుకుల రవాణాకు రైల్వేలు అత్యంత సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గమని చెప్పారు.

సమర్థవంతమైన రైల్వే రవాణా వ్యవస్థ పరిశ్రమలకు రవాణా వ్యయాలను తగ్గించడంలో, సరఫరా వ్యవస్థను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సమావేశాన్ని ఢిల్లీ మెట్రో రైలు సంస్థ భద్రతా కార్యకలాపాల సలహాదారు శ్రీనివాస్ నందూరి సమన్వయం చేశారు. పరిశ్రమలు, రైల్వేలు పరస్పర సహకారంతో సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారు.

CLICK HERE TO READ MORE : శ్రీసంపటాలమ్మ తల్లి అమ్మవారి గ్రామసంచారం..

CLICK HERE TO READ MORE :

Leave a Reply