6 Cr.| ‘ సేవాతీర్థ్ ‘ లో తొలి నిర్ణయాలివే..

6 Cr.| ‘ సేవాతీర్థ్ ‘ లో తొలి నిర్ణయాలివే..

6 Cr.| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రధాని కార్యాలయం కొత్త భవనం ‘సేవా తీర్థ్’ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ సేవా తీర్థ్ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోడీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు.

అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోడీ సంతకాలు చేశారు. సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతో పాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్థ్ లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్ తో పాటు కర్తవ్య భవన్ 1, 2ను మోడీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.

Leave a Reply