మంది మార్భలం చూసి మోసపోకండి..

మంది మార్భలం చూసి మోసపోకండి..

  • మీ తలుపుతట్టి అండగా నిలిచే వ్యక్తిని ఆదరించండి
  • కారు గుర్తుకు ఓటేసి మరోసారి ఆశీర్వదించండి
  • 5వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మామిళ్ళ ఆంజనేయులు

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ర్యాలీలు, మంది మార్భలం, డబ్బులు చూసి మోసపోకండి.. మీ ఇంటికొచ్చి మీ పెద్ద కొడుకులా తలుపుతట్టి అండగా నిలిచే వ్యక్తిని ఆదరించాలని మెదక్ పట్టణంలోని 5వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మామిళ్ళ ఆంజనేయులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మెదక్ పట్టణంలోని 5వ వార్డులోని ఇందిరాకాలనీ, ఇందిరాపూరి కాలనీ, మిలిటరీ కాలనీ, లక్ష్మీవర్దయ్య కాలనీల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటరుమహశయులను అభ్యర్థించారు. ఓట్ల కోసం ర్యాలీలు, మంది మార్భాలం, డబ్బులతో ముందుకొచ్చి ఆర్భాటాలతో హంగామా చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ఈనెల 11 వరకే ఈ మంది మార్భలం అంతా అని ఆ తర్వాత నేనొక్కడినే మీ ఇంటికి వస్తానని చెప్పారు. డబ్బులున్న కరోడ్ పతులు ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి ర్యాలీలు చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని చెప్పారు. దయచేసి అందరూ ఆలోచించాలన్నారు. తాను అంత ఖర్చు చేయలేకున్నా ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా తక్షణమే స్పందించి క్షణంలో మీ ముందుకు వచ్చి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. కరెంట్, నీళ్లు, డ్రైనేజీ వంటి ఏ సమస్య వచ్చినా రాత్రింబవళ్లు తేడా లేకుండా నిమిషాల్లో వచ్చి సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకులా పనిచేస్తానని భరోసా ఇచ్చారు.

Leave a Reply