5G Mobile | స్పీడు పెంచిన అంగన్వాడీలు..

5G Mobile | స్పీడు పెంచిన అంగన్వాడీలు..

5G Mobile | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మరింత వేగంగా అంగన్వాడీ సేవలను అందించడానికి ఐసీడీఎస్ సిబ్బందికి 5జీ మొబైల్ ఫోన్లను ఇస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 292 మంది ఐసీడీఎస్ సిబ్బందికి రూ.36.50 లక్షల విలువైన 5జి స్మార్ట్ ఫోన్లను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. సేవల్లో వేగం, పారదర్శకత కోసం అంగన్వాడీ వ్యవస్థలో స్మార్ట్‌ టెక్నాలజీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్‌ వ్యవస్థ వినియోగం కీలకమన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4 జీ ఫోన్లు సరిగ్గా పని చేయలేదన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం 5 జీ నెట్ వర్క్ తో ఫోన్ లు అందించినట్లు పేర్కొన్నారు.

5G Mobile

తల్లిండ్రులు తమ చిన్నారులను నమ్మకం, ధైర్యం, విశ్వాసంతో అంగన్వాడీలకు పంపిస్తున్నారన్నారు. చిన్నారులను సమర్ధవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అంగన్వాడి సిబ్బంది పై ఉందన్నారు. అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500 వరకు వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆశావర్కర్లకు కూడా ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్ సిబ్బంది అంకితభావంతో పని చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply