55 crore released : 6787 పేదోళ్లకు సాయం Andhra Prabha News

55 crore released : 6787 పేదోళ్లకు సాయం Andhra Prabha News
సీఎంఆర్ ఎఫ్ ఫైల్ పై ఈ ఏడాది తొలి సంతకం
6787 మందికి రూ.55 కోట్ట ఆర్థిక సాయం
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

55 crore released : తెలుగు సంవత్సరం తొలి రోజు పేదలకు సాయం అందించే దస్త్రంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. 6787 మందికి ఆర్థిక సాయం అందించే రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసి నిధులు విడుదల చేశారు.

ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్ ఓసి కింద రూ.1241 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. 21 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 1,36, 240 మందికి సాయం అందించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా….పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్నారు. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వదిం,చారు.





