Rs. 3.50 lakh | ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
Rs. 3.50 lakh | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రం సమీపంలో కౌలు రైతు వ్యవసాయ పొలం వద్ద నిలువ ఉంచిన పత్తికి ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి దగ్ధమై సుమారు రూ. 3.50 లక్షల(Rs. 3.50 lakh) ఆస్తి నష్టం చోటు చేసుకుంది.
ఊట్కూర్ మండల కేంద్రంలోని కురువ వీధికి చెందిన బాధిత రైతు లడ్డచంద్ర పోల మల్లేష్(Laddachandra Pola Mallesh) అనే కౌలు రైతు గ్రామ సమీపంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఈ ఏడాది కౌలుకు వేసుకొని పంట సాగు చేయడంతో పాటు తన సొంత వ్యవసాయ పొలంలో 4 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసి పత్తి తొలగించిన తర్వాత విక్రయించేందుకు కౌలు పొలంలో 14 ఎకరాల్లో పండించిన పంట నిల్వచేశాడు.
ఈ రోజు పండించిన పంట పత్తి మిల్లుకు విక్రయించేందుకు గ్రామంలో కూలీల వద్దకు వెళ్లగా పొలం వద్ద నిలువ ఉంచారు. ప్రమాదవశాత్తు పత్తి పంటకు నిప్పు అంటుకోవడంతో సుమారు 50 కింటాల( 50 quintals) పత్తి దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతు వ్యవసాయ పొలానికి వెళ్లి దగ్ధమైన పంటను చూసి లబోదిబోమంటూ మొత్తుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మంటలు అంటించారని బాధిత రైతు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పలువురు యువకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా యువకులు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన పత్తి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనపై అగ్నిమాపక ఎస్సై రమేష్ రెడ్డి(SI Ramesh Reddy), ఆర్ఐ కృష్ణారెడ్డి పంచదామా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పిటిసి సూర్య ప్రకాశ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ గోవిందప్ప మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ బాధిత రైతులు పరామర్శించారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరారు.


