50 Arts | చైతన్య పాఠశాలలో ఆర్ట్స్ ప్రదర్శన….

50 Arts | చైతన్య పాఠశాలలో ఆర్ట్స్ ప్రదర్శన….

50 Arts | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు మండల కేంద్రంలో గల చైతన్య ఉన్నత పాఠశాలలో ఆర్ట్స్ ప్రదర్శన నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన వలపిశెట్టి మనీషా సుమారు 50 ఆర్ట్స్ చిత్రాలను గీసారు. వాటిని పాఠశాలలో ప్రదర్శించారు. అంతేకాకుండా చిత్రాలను గీసే విధానాన్ని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం మనిషా మాట్లాడుతూ ప్రతిభా ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పారు. పట్టుదలతో ఎలాంటి చిత్రాలైనా తీయవచ్చని ఆమె తెలిపారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్ మాట్లాడుతూ.. మనీషా గీసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.

50 Arts

పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు ఆమె గీసిన చిత్రాలను కనులారా తిలకించడం జరిగిందన్నారు. జిల్లా రాష్ట్రస్థాయిలో జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలో ఇట్టి చిత్రాలను ప్రదర్శించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనీషా గీసిన చిత్రాలను తమ పాఠశాలలో ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల అధ్యాపక బృందం అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్ ఉపాద్యాయులు విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply