4thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

4thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా.. యుద్ధం.. గెలిచేదెవరు? మిగిలేదేమిటి?

4thMarchCartoon | ప్రజానాయకుడి లక్ష్యం – శాంతి, పరిపాలనా సాఫల్యం
యుద్ధోన్మాదుల పాలనలో ప్రపంచ భవితవ్యం
ట్రంప్ వ్యాఖ్యలు – వ్యంగ్యంగా ఔరా కార్టూన్ ఆవిష్కరణ

4thMarchCartoon
4thMarchCartoon

దేశాధినేతలు ఎవరైనా ఏం కోరుకుంటారు? చక్కటి పరిపాలన అందించి ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కదా. ఒకవేళ అనివార్యమై, తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఇతర దేశాలతో యుద్ధం సంభవిస్తే, ఆ యుద్ధం ఎక్కువకాలం కొనసాగాలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే యుద్ధం అనేది చివరికి వినాశనం, విషాదం, తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్థి నష్టం మాత్రమే మిగుల్చే దారుణ వాస్తవం.

ముందుగా యుద్ధం రాకుండా చూడటం, ఒకవేళ యుద్ధం వస్తే అది త్వరగా ముగిసేలా శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయడం – అదే నిజమైన బాధ్యతాయుత నాయకత్వం. యుద్ధంలో గెలిచేదెవరైనా, మిగిల్చే విషాదం మాత్రం గెలిచిన దేశానికైనా, ఓడిన దేశానికైనా ఒకటే. పునర్నిర్మాణం కోసం దశాబ్దాలు పడతాయి. తర్వాత తరాలు కూడా ఆ తీవ్ర నష్టం భారాన్ని మోయాల్సిందే. ఇది ఒక తీవ్ర హెచ్చరికగా చరిత్ర చెబుతోంది.

యుద్ధం జరిగిన దేశం మాత్రమే కాదు, ఆ దేశంతో మైత్రి ఉన్న మిత్ర దేశాలతో కూడా దెబ్బతిన్న దౌత్య సంబంధాలు, ఘర్షణలు, అతిక్రమణలు పెరుగుతాయి. అందుకే యుద్ధాన్ని కోరుకోనివారే అసలైన ప్రజానాయకులు. వారి లక్ష్యం సామరస్యం, ప్రజల విశ్వాసం, శాంతి.

కానీ, ఒకవేళ యుద్ధోన్మాదుల చేతికి పగ్గాలు వస్తే? నిత్యం పొరుగు దేశాలతో ఘర్షణలు, ఆక్రమణలు, అతిక్రమణలు కొనసాగుతాయి. ప్రపంచాన్ని అస్థిరత వైపు నెట్టే సంచలన రాజకీయాలు మొదలవుతాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు “విజయవంతంగా యుద్ధం చేస్తూనే ఉండగలం” అన్న వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వ్యాఖ్యలు ప్రపంచానికి ఒక సూటి ప్రశ్న లాంటివి — యుద్ధం నిజంగా విజయం తీసుకురాగలదా? లేక మరిన్ని వినాశనాలు మాత్రమే మిగుల్చుతుందా?

ఈ అంశాన్ని చమత్కార వ్యంగ్యం, తీవ్ర విమర్శ, స్పష్ట సందేశంతో ఆవిష్కరించిన ఆంధ్రప్రభ కార్టూన్ నిజంగా ఒక ఆలోచింపజేసే కార్టూన్. రెండు దశాబ్దాలుగా పాఠకులను అలరిస్తోన్న ‘ఔరా’ ఫీచర్ మరోసారి ప్రపంచ రాజకీయాలపై తనదైన ముద్ర వేసింది.

-ఆంధ్రప్రభ వెబ్ డెస్క్


Leave a Reply