మేయర్ గా కూరగాయల ఉమారాణి..

మేయర్ గా కూరగాయల ఉమారాణి..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఇందూరు ప్రజల్లో ఎవరి నోట విన్న ఇందూర్‌గడ్డపై ఏ జెండా ఎగిరే నా.. అన్న ఉత్కంఠకు తెరవీడింది ఎట్టకేలకు ఇందూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవే సింది. నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగింది. సామాజిక సమీకరణాలు ,రాజకీయ చతురతతో కాంగ్రెస్ పా వులు కదిపింది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తూ, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెంది న 49వ డివిజన్ కార్పొరే టర్ కూరగాయల ఉమా రాణికి మేయర్ గా ఎన్నికయ్యారు.

సామాన్య నేపథ్యం..

49వ డివిజన్ కార్పొరేటర్ గా కూరగా యల ఉమా రాణికి ఉన్న సామాన్య నేపథ్యం, ప్రజల తో ఆమెకున్న మమేక త్వం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. జిల్లా రాజ కీయాలపై పట్టున్న మహే ష్ కుమార్ గౌడ్, ఉమా రాణి పేరును అధిష్టానం వద్ద బలంగా ప్రతిపాదించి ఎట్టకేలకు ఇందూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.

మొట్టమొదటిసారిగా టిపిసిసి అధ్యక్షులు ఆశీర్వాదం తీసుకున్న ఉమారాణి

మేయర్ గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి మొట్టమొదటిసారిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

Leave a Reply