48 Maoist | 48మంది మావోయిస్టుల లొంగుబాటు

48 Maoist | 48మంది మావోయిస్టుల లొంగుబాటు

  • DGP ముందు లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత దేవా..

48 Maoist | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత బర్సి దేవా సహా 48 మంది(48 people) కీలక మావోయిస్టులు ఈ రోజు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. హిడ్మా(Hidma) మరణం తర్వాత అతని స్థానంలో నియమితుడైన దేవా లొంగుబాటుతో PLGA బెటాలియన్ పూర్తిగా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సి దేవా ఇవాళ లొంగిపోయాడు. దేవాతోపాటు 48 మంది నక్సలైట్లు సరండర్ అయ్యారు. ఆయుధాలు పోలీసులను అప్పగించి మావోయిస్టు(Maoist) అగ్రనేతలు లొంగిపోయారు. హిడ్మా మృతి తర్వాత అతని స్థానంలో దేవాని మావోయిస్టు పార్టీ నియమించింది. ప్రస్తుతం దేవాతోపాటు 48 మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడంతో PLGA బెటాలియన్ మొత్తం ఖాళీ అయ్యింది. ఆయుధాల సేకరణలో దేవా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారికి నిబంధనల ప్రకారం రివార్డ్ అందజేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తక్షణ సాయంగా రూ.25వేల చెక్కులను అందజేస్తామని డీజీపీ తెలిపారు.

Leave a Reply