4400 grams | కనకదుర్గమ్మకు బంగారు కానుకలు

4400 grams | కనకదుర్గమ్మకు బంగారు కానుకలు

4400 grams | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంకు ఆలయ స్థానాచార్యుల కుటుంబ సభ్యులు విలువైన బంగారు ఆభరణాలను భక్తిశ్రద్ధలతో విరాళంగా సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ ధర్మపత్ని, కుమారుడు వి.ఎన్.వి.ఎల్.ఎన్.జి శర్మ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అదనపు ప్రైవేట్ కార్యదర్శి,కోడలు కలిసి అమ్మవారికి సుమారు రూ.4 లక్షలకు పైగా విలువైన 29.700 గ్రాముల బంగారు ఆభరణాలను కానుకగా అందజేశారు.

ఈ బంగారు ఆభరణాలను కుటుంబ సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్‌కు స్వయంగా అందజేశారు. భక్తుల సమక్షంలో ఈ కానుకలను దేవస్థానం అధికారులు స్వీకరించి, ప్రత్యేక రసీదు జారీ చేశారు. విరాళంగా సమర్పించిన ఆభరణాల్లో బంగారు రాళ్ల బొట్టు 12.700 గ్రాములు, నత్తు 12.600 గ్రాములు, బులాకీ 4.400 గ్రాములు ఉండగా, మొత్తం బరువు 29.700 గ్రాములుగా నమోదైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అమ్మవారి కృపతో దేశ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించారు. దాతలకు అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా ప్రత్యేక పూజలు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

4400 grams |

Leave a Reply