అకాల వర్షానికి జుక్కల్‌లో పంటనష్టం…

అకాల వర్షానికి జుక్కల్‌లో పంటనష్టం…

జుక్కల్ (కామారెడ్డి)ఆంధ్రప్రభ : నిన్న సాయంత్రం జుక్కల్ మండలం కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వర్షం కురిసి బీభత్సన్నీ సృష్టించింది. దీంతో మొక్కజొన్న, జొన్న పంట నేలకుఒరిగింది. జుక్కల్ వ్యవసాధికారిని మహేశ్వరి ఆయా గ్రామాలలో పంట నష్టం జరిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జొన్న పంట 30 నుండి 40 ఎకరాల వరకు, మొక్కజొన్న పంట 20 ఎకరాల వరకు పంటలు పూర్తిగా నష్టం పోవటం జరిగిందని, ఇట్టినివేదికను నష్టపరిహారం కోసం జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదించడం జరిగిందని ఆమె తెలిపారు. రేపు వజ్రఖండి తో పాటు మరికొన్ని గ్రామాలలో నష్టపోయిన జొన్న పంటలను పరిశీలించటం జరుగుతుందన్నారు.

Leave a Reply