4 wines | మోత్కూర్లో మద్యం దుకాణాల మూసివేత

4 wines | మోత్కూర్లో మద్యం దుకాణాల మూసివేత
- 4 వైన్సులు, ఒక్క బార్ ని మూసివేసిన ఎక్సైజ్ అధికారులు
4 wines | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని 4 మద్యం దుకాణాలు, 1 బార్ ని సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్ సీఐ రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా సిఐ రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విష్ణుమూర్తి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈనెల 13న ఎన్నికల కౌంటింగ్ రోజు సైతం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కోరారు.ఈ సందర్భంగా సి ఐ వెంట ఎస్ ఐ లు క్రాంతి కుమార్, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
