3rdFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

3rdFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
3rdFebCartoon | బడ్జెట్‌లో హైస్పీడ్ రైళ్లకు ప్రాధాన్యం
ప్రయాణ సమయం తగ్గింపుపై ప్రజల ఆశలు
కేటాయింపులు జరిగితేనే అమలవుతాయా?
టికెట్ అడిగిన ప్రయాణికుడి వ్యంగ్య సందేశం
అమలులో ఉండే ఆలస్యాన్ని చూపించిన కార్టూన్
ఆంధ్రప్రభ కార్టూన్ ‘ఔరా’ ప్రత్యేకత

3rdFebCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ లో హైస్పీడ్ రైళ్ళకు పెద్దపీట వేసారు. దూరప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో హైస్పీడ్ రైళ్ళు గణనీయంగా తోడ్పడతాయి. నిజానికి విదేశాల్లో ఈ హైస్పీడ్ రైళ్ళు ఇప్పటికే సర్వ సాధారణం. మన దేశంలో మాత్రం ఇంకా కొంత టైం పట్టేట్టుంది. అయితే, బడ్జెట్ లో వీటికి ప్రాధాన్యత కల్పించడం నిధులు కేటాయించడం ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఆనందం కల్పించింది. కానీ, బడ్జెట్ లో కేటాయింపులు జరిగినంత మాత్రాన అవి వెంటనే అమలయిపోవు. అవి కార్యాచరణలోకి రావాలంటే అనేక దశలు దాటాలి. ఈ సాంకేతిక అంశాలను పక్కన పెడితే, ప్రకటించిన రోజే ఒక ప్రయాణికుడు వచ్చి హైస్పీడ్ ట్రెయిన్ కి టిక్కెట్టివ్వమనడం, కౌంటర్ లోని వ్యక్తిని ఆశ్చర్యానికి గురిచేసినట్టున్న కార్టూన్ ఇది.
ఇందులో వ్యంగ్యం ప్రజల్లో వీటి పట్ల ఉన్న ఎదురుచూపునూ, కార్యాచరణ ప్రణాళికలో ఉండే ఆలస్యాన్నీ సూచిస్తుంది. ఇలాంటివన్నీ అమలయ్యేందుకు ఎంతో సమయం తీసుకుంటుందని పరోక్షంగా చెప్పిన ఆంధ్రప్రభ కార్టూనిస్ట్ మాధవ్ కార్టూన్ ఔరా ఇది. ఔరా రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులనూ, కార్టూన్ ఇష్టులనూ అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్.
click here to read more cartoons
click here for 1st FebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
