39th anniversary | ఎంపీ, ఎమ్మెల్యే చే క్యాలెండర్ ఆవిష్కరణ

39th anniversary | ఎంపీ, ఎమ్మెల్యే చే క్యాలెండర్ ఆవిష్కరణ
39th anniversary | జైనూర్, ఆంధ్రప్రభ : కుంరం భీం జిల్లా, జైనూర్ మండలం మార్లవాయిలో ఇవాళ నిర్వహించిన ఆదివాసీ ఆత్మబందువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టిఎలిజబెత్ 39వ వర్ధంతి(39th death anniversary) వేదికపై ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ ఏటిఏ 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఖానాపూర్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గౌరవ సభాధ్యక్షుడు మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేష్, పిఓ యువరాజు మర్నాడు, ఎస్పి నికిత పంత్ వక్తల ఆధ్వర్యంలో విడుదల చేశారు.
ఈ క్యాలెండర్(calendar) ఆవిష్కరణ కార్యక్రమంలో కుంరం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఉట్నూర్ ఐటిడిఏ పిఓ యువరాజ్ మర్మట్, కుంరం భీం జిల్లా ఎస్పీ నితికా పంత్, కుంరం భీం జిల్లా డీడీ రమాదేవి, కుంరం భీం జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆత్రం.సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాత్ రావు, ఏటిఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మెస్రం. గంగారాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్నాక. భీంరావ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆత్రం. భగవంత్ రావ్, కుంరం భీం జిల్లా అధ్యక్షులు తలండి. లక్ష్మణ్, జిల్లా ప్రధానకార్యదర్శి మడావి. మనోహర్, జైనూర్ అధ్యక్షులు అడ. జంగు, ఏటిఏ మండల నాయకులు పెందోర్.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
