30 liters | ఎక్సైజ్ దాడులు..

30 liters | ఎక్సైజ్ దాడులు..
- 70 మద్యం బాటిల్లు స్వాధీనం…
30 liters | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. శ్రీశైలంలోని కొత్తపేటలో నివసించే ఓ మహిళ వద్ద 70 మద్యం బాటిల్లను ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రామాంజనేయులు తెలిపారు.
అలాగే మేకల బండ ప్రాంతంలో ఒక వ్యక్తి వద్ద 30 లీటర్ల నాటు సారని ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
