గంభీరావుపేట (సిరిసిల్ల జిల్లా) : భారీ వర్షాలతో ఎగువ మానేరు అవతలి వైపు చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు 30 గంటలుగా నరకయాతన అనుభవించారు. బుధవారం నుండి భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది.. గేదెలను మేపడానికి అవతలి వైపు వెళ్లిన కాపరులతోపాటు రైతులు మొత్తం ఆరుగురు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇందులో ఎగువ మానేరు ప్రాజెక్టు (Maneru project) దగ్గర నర్మాల గ్రామానికి (Narmala Village) చెందిన కాడి నాగం గల్లంతయ్యారు.
ఐదుగురు వాగు అవుతలి గడ్డకు చిక్కుకున్నారు. జంగం స్వామి, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి లు వరద లో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు (police) సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంవత్సరం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ (Collector Sandeep Kumar), ఎస్పీ మహేష్ కుమారులు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) సిబ్బందిని పిలిపించి రెస్క్యూ ఆపరేషన్ (rescue operation) చేపట్టినా బుధవారం రాత్రికి కూడా బాధితులను తీసుకురాలేకపోయారు.
బాధితులను కాపాడేందుకు 30 గంటలుగా శ్రమించారు. సమాచారం అందుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defense Minister Rajnath Singh)తో మాట్లాడి రెండు ఆర్మీ హెలికాప్టర్లను (Army helicopters) పంపాలని విన్నవించారు. గురువారం భారీ వర్షాల నేపథ్యంలో హెలికాప్టర్ల రాక ఆలస్యమైంది. మధ్యాహ్నం వర్షం తగ్గడంతో మరోసారి ఆర్మీ అధికారుల(Army officers)తో బండి సంజయ్ మాట్లాడి రెండు హెలికాప్టర్లను నర్మాలకు తెప్పించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఐదుగురు బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షించారు.
డ్రోన్లతో ఆహారం
వరదల్లో చిక్కుకున్న ఐదుగురికి డ్రోన్ల సహాయంతో ఆహారం, మంచినీళ్లు పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. బాధితులను రక్షించిన హెలికాప్టర్లు ఎగువ మానేరు అవతలి వైపు చిక్కుకొని 30 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్న బాధితులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 30 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. భారీ వరదలతో ఎగువ మానేరు అవతలి వైపు చెప్పుకున్న ఐదుగురిని ఆర్మీ సిబ్బంది సురక్షితంగా రక్షించడంతో బాధిత కుటుంబాలతో పాటు జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గల్లంతైన నాగం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.