
29th Ward | పదేళ్లుగా అధికారంలో ఉన్నా…
29th Ward | పదేళ్లుగా అధికారంలో ఉన్నా…
- 29వ వార్డులో కాంగ్రెస్ వైపు ప్రజలు
29th Ward | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పట్టణంలోని 29 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇల్లందుల రజిని కృష్ణమూర్తి గెలుపు ఖాయం అయిపోయింది. 29వ వార్డులో గడపగడపకు అభ్యర్థి ప్రచారం నిర్వహించి బ్యాలెట్ అందించే క్రమంలో ప్రజలు ఇల్లందులో రజని ని ఆప్యాయంగా ఆహ్వానించి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రజిని మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉండి ఎలాంటి అవినీతి కి పాల్పడలేదని, వార్డు ప్రజల నుండి నయా పైసా కూడా తీసుకోలేదని ధైర్యంగా చెబుతున్నామన్నారు.
ప్రతిపక్షాల నాయకులను నమ్మితే ఐదేళ్లపాటు గోస పడతారన్నారు. మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే 24 గంటలపాటు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే వార్డు అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు వస్తాయన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో 29వ వార్డుకు అత్యధిక నిధులు తీసుకువచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రచార సరళి గమనిస్తే 29వ వార్డు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లినట్లేనని ఇల్లందుల రజనీ కృష్ణమూర్తి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనిపిస్తుంది.
