పూటకొక పార్టీ మార్చే వారిని ఓడించండి

పూటకొక పార్టీ మార్చే వారిని ఓడించండి
- అభివృద్ధికి పాటుపడే కోడి రమేష్ ను గెలిపించండి
బెల్లంపల్లిటౌన్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ లోని 29 వార్డులో పూటకొకపార్టీ మారుస్తూ రంగుల ఊసరవెల్లి లా మారిన వారిని ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీ జే పీ జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29 వ వార్డు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తూ ప్రజల మధ్యల ఉంటున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, 29వ వార్డుబీ జే పీ అభ్యర్థి కోడి రమేష్ కు ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.నిన్నటి వరకు ఈ వార్డులో కౌన్సిలర్ గా పనిచేసిన రాజు లాల్ యాదవ్ వార్డు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ కోశాధికారి సంతోష్ అగర్వాల్, విద్య శంకర ,బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
