29 Labor Laws | లేబర్ కోడ్లను రద్దు చేయాలి…

29 Labor Laws | లేబర్ కోడ్లను రద్దు చేయాలి…
29 Labor Laws | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషన్(Notification of Labor Codes) ఉపసంహరించుకోవాలని పులిమామిడి ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు పద్మమ్మ, కార్యదర్శి సాబేరా బేగం డిమాండ్ చేశారు. ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాలు, ఆశా కార్యకర్తలు సంయుక్తంగా నారాయణపేట జిల్లా( Narayanapet District) ఊట్కూర్ తాహసిల్దార్ కార్యాలయం వద్ద ప్లే కార్డులతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను(29 Labor Laws) రద్దు పరచి నాలుగు లేబర్ కోడ్లను అమలుకు నోటిఫికేషన్ వేయడం తగదు అన్నారు. లేబర్ కోడుల కారణంగా కార్మికులకు పని భారం పెరగడంతో పాటు ఉద్యోగ భద్రత(job security) లేకుండా కనీస వేతనాలు అమలు కాకుండా యాజమాన్యాలపై ఆధారపడే ప్రమాదం ఉందన్నారు.
ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని వేసిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు పులుమామిడి పి హెచ్ సి ఆశా వర్కర్లు జైనబి, శైజాది, మంజులత, హాజ్ బి, సీనమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
