ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు

ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు

  • పల్లెల్లో ఆరోగ్య కేంద్రాలతో అందుబాటులో వైద్యం
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో వైద్య సేవలు అందుబాటులోకి తేవడంతో పాటు ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని ఈలప్రోలులో 15వ ఆర్థికసంఘం నిధులు రూ.36 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం (హెల్త్ సెంటర్) నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను సాధించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రధాన లక్ష్యమన్నారు. మైలవరం నియోజకవర్గంలో రూ.9.35 కోట్లతో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో భవనం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈలప్రోలు సర్పంచ్ కరణం రంగారావు, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎంపీడీవో డి.శకుంతల, పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ ఫర్హీన్, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply