24,000 crores | అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ వివ‌ర‌ణ

24,000 crores | అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ వివ‌ర‌ణ

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి : తిరుపతిలో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేద‌ని. స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేయాల్సిందేన‌ని ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి పి.నారాయ‌ణ అన్నారు. తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంపై అసెంబ్లీ లో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాస్ ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నారాయణ స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 21,170 కి.మీ మేర అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాల్సి ఉంది దీని కోసం 24,000 కోట్లు అవసరం అవుతుంది. ప్రస్తుతం 3,334 కి.మీ మేర యూజీడీ వ్యవస్థ ఉంది మరో 2,860 కి.మీ మేర పనులు జరుగుతున్నాయ‌పి మంత్రి నారాయ‌ణ వివ‌రించారు. ఆర్ధిక పరిస్థితి బట్టి UGD నిర్మాణంపై ముందుకెళ్తాం అని స్ప‌ష్టం చేశారు. ఇక తిరుపతి లో 4.5 లక్షల జనాభా ఉన్నారు.

24,000 crores

ప్రతిరోజూ 75,000 నుంచి లక్ష మంది తిరుపతికి వస్తుంటారు. ప్రతిరోజూ 54.5 MLD ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. మొత్తం 408.4 కిమీ ల పరిధిలో యూజీడీ అవసరం ఉంది. ప్రస్తుతం 284.3 కిమీ పరిధిలో నెట్వర్క్ ఉండగా…మరో 125 కిమీ చేయాల్సి ఉంది. పాత నెట్వర్క్ లో 60 కి.మీ పరిధిలో మార్చాల్సిన అవసరం ఉంది పాత వాటిని మార్చడం తో పాటు కొత్తగా లైన్ వేయాలంటే 152.45 కోట్లు అవసరం అని అంచనా వేశారు పాత వాటిలో 7.5 కి.మీ లైన్ మార్చేందుకు మార్చిలో టెండర్లు పిలుస్తున్నాం. మిగతా ప్రాంతంలో UGD కోసం నిధులపై కేంద్రం తో సంప్రదించి ముందుకెళ్తాం, అని మంత్రి నారాయ‌ణ వివ‌రించారు.

Leave a Reply