తిరుమ‌ల‌లో కంపార్టుమెంట్లు ఫుల్‌

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24గంట‌ల స‌మ‌యం

తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం ప‌డుతోంద‌ని ఆల‌య అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వ దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. వేంక‌టేశ్వ‌రుడిని శ‌నివారం 80,560 మంది భక్తులు ద‌ర్శించుకున్నార‌ని తెలిపారు. 35,195 మంది భక్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని, రూ. 3.22 కోట్ల హుండీ ఆదాయం వ‌చ్చింద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave a Reply