Big Alert | 24 గంటల తాగునీటి సరఫరా బంద్ !

నగర వాసులకు నీటి అలర్ట్ ప్రకటించింది జలమండలి హైదరాబాద్. సోమవారం (ఫిబ్రవరి 17) హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.

సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాను అంతరాయం కలుగనుందని… తిరిగి ఫిబ్రవరి 18న నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంత ప్రజలు ముందస్తుగా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు.

ప్రభావిత ప్రాంతాలివే..

ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్‌, వెంగల్‌రావునగర్‌, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్‌, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌, వివేకానందనగర్‌, ఎల్లమ్మబండ, మూసాపేట్‌, భరత్‌నగర్‌, మోతీనగర్‌, గాయత్రీనగర్‌, బాలాజీపేట, కేపీహెచ్‌బీ, హస్మత్‌పేట్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు ప్రకటించారు.

చింతల్‌, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సూరారం, ఆదర్శనగర్‌, భగత్‌సింగ్‌ నగర్‌, జగద్‌గిరిగుట్ట, అల్వాల్‌, ఫాదర్‌ బాలయ్యనగర్‌, వెంకటాపురం, మాచబొల్లారం, డిఫెన్స్‌ కాలనీ, వాజ్‌పైనగర్‌, యాప్రాల్‌, చాణిక్యపురి, గౌతంనగర్, సాయినాథపురంలోనూ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

చేర్లపల్లి, సాయిబాబానగర్‌, రాధిక, కొండాపూర్‌, డోయన్స్‌, మాదాపూర్‌లో కొంత భాగం, హఫీజ్‌పేట్‌, మియాపూర్‌, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, త్రిషరామ్‌, తమ్మిళ్ల, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, AIIMS, బీబీనగర్ ప్రాంతాల్లో కూడా తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *