225 words | శంకరనారాయణ కొత్త పుస్తకం…

225 words | శంకరనారాయణ కొత్త పుస్తకం…

225 words |త్యాగరాయ గానసభలో ఘనంగా పుస్తకావిష్కరణ
12 వేల కొత్త మాటల సృష్టికర్తగా శంకరనారాయణ
విశిష్ట అతిథుల ప్రశంసలు – హాస్యానికి కొత్త నిర్వచనం
పాఠకులను ఆలోచింపజేసే ‘పన్’దిరి సూక్తులు
త్యాగరాయ గానసభే నా కళా జన్మభూమి : శంకరనారాయణ

225 words | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : త్యాగరాయ గానసభ.. హాస్యావధానాలతో ప్రజలను రంజింపజేసే హాస్య బ్రహ్మ సీనియర్ పాత్రికేయుడు శంకర నారాయణ హాస్యాన్ని, చమత్కారాన్ని రంగరించి తెలుగు పత్రికల్లో రెండు అర్ధాలు వచ్చేట్టు 12వేల కొత్త మాటలను సృష్టించారని, ఈ కోవలో ‘ఫ‌న్’దిరి అంటూ 225 మాటలతో కొత్త పుస్తకాన్ని రచించారని త్యాగరాయ గానం సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి పేర్కొన్నారు. గతంలో ఫన్ గన్, ఫన్ దేహాలు, పన్ పరాగ్, పన్ చామృతం వంటి రచనలతో పాఠకులను అలరింపజేశారని ఆయన అన్నారు.

శంకరనారాయణ కొత్తగా రచించిన ‘పన్’దిరి పుస్తకాన్ని త్యాగరాయ గానసభలో కళా జనార్ధనమూర్తి ఆవిష్కరించారు. తన రచనలతో, హాస్య కార్యక్రమాలతో శంకరనారాయణ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పాటల రచయిత, స్వరకర్త, గాయకుడు రాయారావు విశ్వేశ్వర్ రావు పుస్తక సమీక్ష చేస్తూ ఈ పుస్తకంలోని మాటలు హాస్యాన్ని పండిస్తూ హాయిగా నవ్వుకునే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని అన్నారు. కొన్ని శృంగారభరితంగా ఉండి ఆకట్టుకునే విధంగా ఉన్నాయని వారన్నారు.

మరో విశిష్ట అతిథి భూపతి కృష్ణ కుమార్ మాట్లాడుతూ శంకరనారాయణ హాస్య కార్యక్రమాలలో పాల్గొని ఆనందించానని అంటూ ‘పన్’దిరి పుస్తకంలోని కొన్ని సూక్తులను ఉదాహరించారు. ‘పన్’దిరి పుస్తక రచయిత కళారత్న, హాస్యబ్రహ్మ శంకరనారాయణ మాట్లాడతూ పత్రికలలో తాను రాసిన హాస్య రచనలు, అవధానాలలో అప్రస్తుత ప్రసంగాలకు అలాగే హాస్యావధాన సృష్టికి దోహదపడ్డాయని కొత్త కళా జీవితాన్ని తనకు ప్రసాదించాయని, త్యాగరాయ గానసభ తనకు కళా జన్మభూమి అని అన్నారు. త్యాగరాయ గానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి ఈ కార్యక్రమ వందన సమర్పణ చేశారు.

Leave a Reply