నాగార్జున సాగ‌ర్‌కు 22 గేట్లు ఎత్తివేత‌

2,18,320 క్యూసెక్కుల అవుట్ ఫ్లో

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై 22 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,69,884 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,70,311 క్యూసెక్కుల ఉండ‌గా, ప్రాజెక్టు నుండి అన్ని డివిజ‌న్‌ల‌కు 2,18,320 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో అని అధికారులు వెల్ల‌డించారు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586.40 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీ లకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 302.3940 టీఎంసీలు ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ కేంద్రానికి, ఏఎంఆర్పి కి నీటిని విడుదల చేస్తున్నారు.

Leave a Reply