హర్మూజ్ ను తెరవండి..

హర్మూజ్ ను తెరవండి..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి తెరవాలని 22 దేశాలు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. అరబ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూఏఈ, బహ్రెయిన్ సహా ఇరాన్‌ను కోరారు. దాడులు, ప్రతిదాడులు నేపథ్యంలో ఇరాన్ అరబ్ దేశాలో ఉన్న అమెరికా సదుపాయాలపై వైమానిక, డ్రోన్ దాడులు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తమ దేశాలపై దాడి నిలిపివేయాలని ఇరాన్‌ను కోరారు. ఇరాన్ చర్యలు ప్రపంచ జనాభా తీవ్రంగా సంక్షోభాని ఎదురుకునే అవకాశం ఉందని ఈ దేశాలు సంయుక్త ప్రకటించాయి. మరోవైపు హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యూఎస్-యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులు దుస్సాహసంగా అభివర్ణించింది.
