అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి

అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి

  • 21వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి శివశంకర్

కల్వకుర్తి: ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 21వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గోరటి శివ శంకర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రతిరోజు వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలే తమ గెలుపుకు దోహదపడతాయని శివశంకర్ చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందంటూ ప్రచారంలో వాటిని ఆస్త్రాలుగా మలుచుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గత పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొంటూ తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వార్డు ప్రజలు ఆలోచించి ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని శివశంకర్ ఓటర్లను కోరారు.

Leave a Reply