వార్డును అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వండి

క్యాతన్ పల్లి,ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)
మున్సిపాలిటీలోని 20వ వార్డును అభివృద్ధి చేసేందుకు తనకు ఒకసారి అవకాశం ఇవ్వండనీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంద వేణుగోపాల్ గురువారం వార్డు ప్రజలను వేడుకున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వార్డులోని వీధి వీధికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు .గతంలో పనిచేసిన నాయకులు వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీలో 20వ వార్డును అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దానని అన్నారు.
ఈ ప్రచారంలో రేవెల్లి ఓదెలు, గోనె రాజేందర్,వార్డు ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
