ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం …

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం …

ప్రచారంలో దూసుకుపోతున్న 20 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గాదరి రేణుక …

జనగామ, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యమని 20 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గాదరి రేణుక పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వార్డు పరిధిలో పార్టీ ఇన్చార్జుల నాయకుల తో కలిసి 20 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గాదరి రేణుక తన మద్దతు దారులతో కలిసి ఇంటింటికి తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ సంధర్బంగా ఆమే మాట్లాడుతూ.. గ్రామంలో మౌళిక సదుపాయాల సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు, త్రాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతని స్తానని చెప్పారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు వార్డు ప్రజలకు అందేల కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు ..

Leave a Reply