టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ (Kohli-Rohit) వన్డే భవితవ్యంపై త్వరలోనే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే టీ 20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు లెజెండ్స్.. 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) ఆడతారా..? లేదా..? అనే అనుమానాలున్నాయి. ఇప్పటికే కోహ్లికి 36 ఏళ్లు, రోహిత్ కు 38 ఏళ్ల వయసుంది. 2027కు వీళ్లిద్దరూ కూడా 40 ఏళ్లకు దగ్గరపడతారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లు ఆడనున్న కోహ్లి, రోహిత్.. 2026లో న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తో కూడా వన్డేలు ఆడనున్నారు. ఈ 12 మ్యాచుల ప్రాక్టీస్ తో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు సన్నాహకాలు సరిపోతాయా..? అనేది ఒక ప్రశ్న. అలాగే అప్పటి వరకు వీళ్లిద్దరూ వన్డేలు ఆడతారా..? అనేది మరో ప్రశ్న. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫ్యూచర్ పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఈ విషయంపై చర్చిస్తామని బీసీసీఐ (BCCI) వర్గాలు చెప్తున్నాయి. ‘వన్డే వరల్డ్ కప్ కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి కోహ్లి, రోహిత్ (Kohli-Rohit) ఇద్దరూ 40 ఏళ్లకు దగ్గరపడతారు.
కాబట్టి ఈ వరల్డ్ కప్ కోసం స్పష్టమైన ప్లాన్ అవసరం. వీళ్లిద్దరూ ఆడకపోతే కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’ అని వారంటున్నారు. అయితే కోహ్లి, రోహిత్ రిటైర్ (Kohli, Rohit retire) అవ్వాలని ఎవరూ ఒత్తిడి తీసుకురారని, కానీ నిజాయితీగా వారితో చర్చిస్తామని వివరించారు. వచ్చే వన్డే సైకిల్ మొదలయ్యే ముందే దీనిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.